»Passenger Fire On Air India Services Video Goes Viral
Air India services: ఎయిర్ ఇండియా సేవలపై ప్రయాణికుడు ఫైర్.. వీడియో వైరల్
ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ దారుణంగా ఉందంటూ ఓ కస్టమర్ వీడియో పెట్టాడు. తన జర్నీలో జరిగిన అసౌకర్యాన్ని వివరించాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Passenger fire on Air India services.. Video goes viral
Air India services: మాములుగా విమానంలో ప్రయాణించే వారికి విండో సీట్లో కూర్చోవాలనే కోరిక ఉంటుంది. అక్కడ కూర్చుంటే మేఘాలను దగ్గరనుంచి చూసే వెసులబాటు ఉంటుందని ప్యాసింజర్స్ భావిస్తారు. అలా వాళ్ల కోరికను ఎయిర్ సర్వీసులు సొమ్ము చేసుకుంటారు. విండో సీట్లకు ఎక్కువ డబ్బులు వసుళ్లు చేస్తారు. టికెట్ బుకింగ్ సమయంలో సీట్ ప్రిఫరేషన్స్ కోసం అదనంగా డబ్బులు వసుళ్ చేస్తారు. అయితే అలా ఇష్టంతో ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమాన సర్వీస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా ఫ్లైట్ ఎక్కిన తరువాత సీటు విరిగిపోయి ఉంది. ఈ నెల 4న బెంగళూరు వెళ్లేందుకు ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఓ వ్యక్తి తనకు ఎదురైన పరిస్థితిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
విండో సీటు కావాలనే వెయ్యి రూపాలు అదనంగా చెల్లించి విమానం ఎక్కినట్లు సదరు ప్రయాణికుడు వెల్లడించారు. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు సౌకర్యంగా ప్రయాణించవచ్చు కదా అనే ఉద్దేశంతో విండో సీట్లో కూర్చుంటే అది విరిగిపోయి కనిపించిందని చెప్పాడు. వెంటనే ఫ్లైట్ సిబ్బందికి తెలియజేస్తే వారు ఇంజనీర్‌ను తీసుకొచ్చారు కానీ దాన్ని బాగు చేయలేకపోయారు. తాందో చేసేది ఏం లేక ఢిల్లీ నుంచి బెంగళూరు వరకూ ఆ విరిగిన సీట్లోనే అవస్థపడుతూ ప్రయాణించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో వీడియో తీసీ మరీ ఎయిర్ ఇండియా సర్వీస్‌కు ట్యాగ్ చేసి చెప్పాడు. దాంతో కంపెనీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి సారీ చెబుతూ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Paid extra 1k for a broken window seat (22A) on Air India AI512 from DEL to BLR on 4th Apr. They called the engineer to fix it, but he couldn't. Is this what I paid the flight fare for? Can't I atleast expect a proper seat after paying so much? @airindia@DGCAIndia@Ministry_CApic.twitter.com/j2vxlcRbnt