Devara: చివరి దశకు చేరుకున్న ‘దేవర’.. నెక్స్ట్ ఎన్టీఆర్ యుద్ధమే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర'. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి దేవర షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు కంప్లీట్ కానుంది?
'Devara' has reached its final stage.. Next NTR war?
Devara: ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామాగా దేవర మూవీ రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది దేవర. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది ‘దేవర’. లేటెస్ట్ షెడ్యూల్లో సైఫ్ అలీ ఖాన్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
అయితే.. దేవర టాకీ పార్ట్ మొత్తం ఈ ఏప్రిల్‌తో కంప్లీట్ కానుందని తెలుస్తోంది. పార్ట్ 1కి సంబంధించి మూడు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఈ సాంగ్ షూటింగ్‌ను జులైలో పూర్తి చేయనున్నారట. దీంతో ఏప్రిల్ మంత్ ఎండింగ్లో వార్ 2 షూటింగ్లో జాయిన్ కానున్నాడట ఎన్టీఆర్. పది రోజుల పాటు జరిగే షెడ్యూల్లో తారక్ పై క్రూషియల్ సీన్స్ షూట్ చేయనున్నారట. వార్2 కోసం మొత్తం 60 రోజులు డేట్స్ ఇచ్చాడట ఎన్టీఆర్. వార్ 2 అయిపోగానే దేవర సాంగ్స్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత దేవర పార్ట్ 1 రిజల్ట్‌ను బట్టి.. పార్ట్ 2 ఉండనుంది.