KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రహదారుల దుస్థితిపై మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ స్పందించారు. ఆర్ & బీ అధికారులతో కలిసి పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు.