MLG: నిత్యం ములుగు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ములుగులో ప్రతీ ఒక్కరిని సొంతవాళ్ళుగా భావించే గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి సీతక్క అని ఇస్సార్ ఖాన్ తెలిపారు.