TG: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 6న CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రూ.500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు.