NLR: జిల్లాలోని పాలెం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను శుక్రవారం రాత్రి ఆత్మకూరు సీఐ గంగాధర్ తనిఖీ చేశారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు వారి సిబ్బందితో కలిసి బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను తనిఖీ చేసి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. బస్సులో మంటలను ఆర్పే పరికరాలను ఉంచుకోవాలని సిబ్బందిని కోరారు.