BDK: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య త్యాగం మరువలేనిదని కొనియాడారు. అనంతరం జనగణన శిక్షణ ముగింపు సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.