SS: జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణే ధ్యేయంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన పత్రాలతో పాటు హెల్మెట్, సీటు బెల్ట్ ధారణను పరిశీలిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.