KKD: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలోని బీసీ వసతి గృహాన్ని పీడీ శివరామ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకుని మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలన్నారు.