NDL: శిరివెళ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైతుకు చెందిన గడ్డివాము మంటల్లో కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. గ్రామస్థులు వెంటనే స్పందించి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.