మార్కాపురం జిల్లా బీసీవై అధ్యక్షుడు నరేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కనిగిరిలో జరిగిన సమావేశంలో బీసీలకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి రుణాలు ఇవ్వాలని, అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించాలని కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలని, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పుకొచ్చారు.