ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును సులభంగా మార్చుకునేందుకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించింది. దేశంలోనే ఈ సదుపాయం తెచ్చిన తొలి బ్యాంక్ ఇది. దీనివల్ల బ్యాంక్‌కు వెళ్లే పనిలేకుండా, మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సురక్షితంగా నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త నంబర్ మార్చిన 24 గంటలు లావాదేవీలపై పరిమితులు ఉంటాయని బ్యాంక్ తెలిపింది.