KRNL: జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక సూచనలు హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. ఇటీవల ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తులు అత్యవసరం ఉందని చెప్పి, డబ్బులు తీసుకొని ఫోన్ పే చేసినట్లు చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతాము అంటూ మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండలని సూచించారు.