ATP: క్షమాగుణం, దయ, నిస్వార్థ ప్రేమకు నిదర్శనం ‘గుడ్ ఫ్రైడే’ అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే ‘గుడ్ ఫ్రైడే’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యేసు త్యాగనిరతి మనకు ప్రేమ, ఓర్పు, క్షమాగుణాన్ని నేర్పుతాయన్నారు.