ASF: సిర్పూర్(టి) మండలం పాతల్లగూడ గ్రామంలో గుడుంబా, మత్తు పదార్థాల నిర్మూలనపై గ్రామస్థులకు ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. ASI రాజశేఖర్ మాట్లాడుతూ.. మత్తు పదార్ధాలకు బానిసలై మంచి భవిష్యత్తును కొంతమంది యువత చేతులారా పాడుచేసుకుంటున్నారని అన్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలు, డ్రగ్స్ వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.