W.G: పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వల్లూరి నారాయణమూర్తి ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడుని టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చెయ్యగా దానిని శుక్రవారం అందజేశారు.