W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరు భీమవరం రోడ్డులో గ్యాస్ కొరత నివారించి ప్రజలకు గ్యాస్ సప్లై చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్యాస్ బండలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే. లక్ష్మణరావు పాల్గొన్నారు.