KMM: మధిర పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు పలు చర్చల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చిలో ఉదయం నుంచే ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు గుర్తుగా విశ్వాసులు ఉపవాసం పాటిస్తూ, పట్టణంలో ప్రధాన వీధుల్లో శిలువ మార్గంను ఆచరించారు.