CTR: తవణంపల్లె మండలం మొదలపల్లి గ్రామానికి చెందిన లవ కుమార్ (28) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అతను అమర్ రాజా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏమైందో ఏమో చెరువులో శవమై తేలాడు. శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీధర్ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.