AKP: పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో చీడికాడ మండలం జైతవరంలో సంబరాలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించారు. గ్రామ మహిళలు ‘జై అమరావతి’ అంటూ ముగ్గుల రూపంలో దీపాలంకరణలు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా కొవ్వొత్తులు వెలిగిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.