BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో ఇదే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.