తూ.గో: దేవరపల్లి మండలం యర్నగూడెం APSRTC బస్టాండ్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. బస్సుల రాకపోకలు స్పష్టంగా కనిపించక గందరగోళం ఏర్పడుతోంది. గతంలో ఈ ఫ్లెక్సీల వల్ల గాయాలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.