AP: క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా ఏసుక్రీస్తు త్యాగాలను CM చంద్రబాబు స్మరించుకున్నారు. ‘మానవాళి పాప విమోచనం కోసం ఏసు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర గుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయం. ప్రేమపాత్రమైన ఆయన జీవిత సందేశం మనకు ఆదర్శం కావాలి’ అంటూ ట్వీట్ చేశారు.