»Pawan Kalyan Ustad Bhagath Singh Is Not The Only One Og Is Also Coming
Pawan Kalyan: ఉస్తాద్ ఒక్కడే కాదు.. OG కూడా వచ్చేస్తున్నాడు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎలక్షన్స్ సమయంలో ఊహించని విధంగా సినిమా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఉస్తాద్ ఒక్కడే కాదు.. ఓజి కూడా వచ్చేస్తున్నాడని తెలుస్తోంది.
Pawan Kalyan Ustad Bhagath singh is not the only one.. OG is also coming?
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పట్లో పవన్ సినిమాల అప్డేట్స్ కష్టమనుకున్నారు. కానీ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 19న ఈ ప్రోమో వీడియో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి డబ్బింగ్ పనులను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. పొలిటికల్ టచ్ ఇచ్చేలా ఈ ప్రోమో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఉస్తాద్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ఓజి గ్లింప్స్ కూడా బయటికొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏపి ఎలక్షన్స్ పూర్తి కాగానే ముందు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు పవన్. అప్పటి వరకు ఓజి నుంచి ఎలాంటి గ్లింప్స్ రిలీజ్ అయ్యే అవకాశం లేదనుకున్నారు.
అయితే.. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ఇచ్చిన అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది. ‘ఓజీ’ మూవీలో ఇమ్రాన్ రోల్ గురించి అడగ్గా.. ప్రస్తుతం ఏమీ చెప్పలేను. కానీ త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ కాబోతోంది.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఉస్తాద్ లాగే ఓజి నుంచి ఎప్పుడైనా సడెన్ సర్ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా.. ప్రజెంట్ ఉస్తాద్, ఓజి గ్లింప్స్.. ఏపి ఎలక్షన్స్ టార్గెట్‌గా రాబోతున్నాయనే చెప్పాలి.