రత్నంతో ఉన్న ఆత్మీయానుబంధంతో పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో సినిమా చేయాలని సంకల్పించారు. డైరెక్టర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు ఏ ఒక్క పేరు ముందుకు రాని పరిస్థితి. అప్పుడే రత్నం డెసిషన్ తీసుకుని పవన్నే డైరెక్ట్ చేయమని ప్రోద్బలం చేశారని అప్పుడు చెప్పుకున్నారు.
ఖుషీ అతి పెద్ద హిట్. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ప్రారంభదశలో జేగంటలు మోగించి, పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్‌ని చేసినసినిమా. తర్వాత చాలా కాలానికి గానీ, బంగారం చిత్రానికి మోక్షం దొరకలేదు. బంగారం చిత్రం అంత గొప్పగా ఆడలేదు. ఏదో చౌచౌగా ఆడింది. పాటలు కూడా పెద్దగా ఎక్కలేదు. ఖుషీ సినిమాలో మణిశర్మ చేసిన పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. కానీ బంగారం సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా మచ్చుకి కూడా గుర్తుకి రాదు. సంగీతదర్శకుడు విద్యాసాగర్ ఏ ఒక్క ట్యూన్‌ని పండించలేకపోయారు.
రత్నంతో ఉన్న ఆత్మీయానుబంధంతో పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో సినిమా చేయాలని సంకల్పించారు. డైరెక్టర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు ఏ ఒక్క పేరు ముందుకు రాని పరిస్థితి. అప్పుడే రత్నం డెసిషన్ తీసుకుని పవన్నే డైరెక్ట్ చేయమని ప్రోద్బలం చేశారని అప్పుడు చెప్పుకున్నారు. చాలా కాలం పవన్ అంగీకరించలేదన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణే రాసుకున్న కథ కావడం, అందులో ఉన్న హీరో ఆవేశం, న్యాయం కోసం పోరాడే తత్వం వీటన్నిటి దృష్ట్యా ఇంకెవరు హేండిల్ చేసినా కూడా కథకి న్యాయం జరగదని భావించి, నిర్మాత కూడా తననే చేయమని అడగడంతో పవన్ చిట్టచివరికి డైరెక్ట్ చేయడానికి అంగీకరించారని అప్పట్లో చెప్పుకున్నారు.
అయితే కథలో ఏ రకమైన కమర్షియల్ యాంగిల్ లేకపోవడం, కేవలం దేశభక్తి, పౌరుల అంకితభావం అనే ఓ డాక్యుమెంటరీ స్టయిలో కథ ఎంతవరకూ ఆదరిస్తారు, ఏ మేరకు కమర్షియల్ మైలేజ్ దొరకుతుందనే మీమాంస అలుముకుంది. పైగా ఖుషీ తర్వాత వచ్చిన బంగారం కూడా కమర్షియల్‌గా అంత పే చేయకపోవడం కూడా పవన్ కల్యాణ్‌ని చాలా వరకూ ప్రభావితం చేసింది. దర్వకత్వం పట్ల అభిరుచి, అనురక్తి నిండుగా, మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ కారణాల దృష్ట్యా దర్శకత్వం చేయడం ఆ పరిస్థితులలో అంత సమంజసం కాదని తీర్మానించుకుని, నిర్మాత రత్నంని కూడా ఈ దిశగా ఒప్పించారు. బడ్జెట్టు పరంగా కూడా కాస్తంత ఎక్కువే అయ్యే అవకాశాలే అన్ని కోణాలలో కనిపించడంతో పవన్ కళ్యాణే ఆ ప్రాజెక్టుని ఇష్టాపూర్వకంగా నిలిపి వేశారని పవన్ కళ్యాణ్ సన్నిహితవర్గాలు చెప్పేవారు.
ఆ సినిమాయే సత్యాగ్రాహి. సత్యాగ్రహి ఓపెనింగ్ కూడా జరిగింది. పేపర్లో సత్యాగ్రహి డిజైన్లు కూడా ప్రచురితమయ్యాయి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.ముఖ్యంగా టైటిల్ మంచి సంచలనం సృష్టించింది. అయినా ఎంతో ప్రిపరేషన్‌తో ప్రారంభమైన సత్యాగ్రహి ఆకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే తనకి డైరెక్షన్ చేయాలన్న కోరిక మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం వదులుకోలేదు. ఆ ఆలోచనే జానీ రూపంలో మళ్ళీ తెరకెక్కింది. డైరెక్టర్‌గా పవన్ కళ్యాణ్‌కి చాలా మంచి పేరొచ్చింది. చాలా మంది ఆయన్ని డైరెక్ట్ చేయమని ఆ తర్వాతి రోజుల్లో ఒత్తిడి తెచ్చారు. డైరెక్టర్‌గా పేరొచ్చిన మాట నిజమే కానీ, జానీ కమర్షియల్‌గా పెద్గగా సక్సెస్ కాలేదు.