ప్రస్తుతం సినిమాటోగ్రాపీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందులు దుర్గేష్ ఆ తర్వాత వ్యవసాయ మంత్రిత్వశాఖకు బదిలీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. నాగబాబుని సినిమాటోగ్రాఫీ మంత్రిగా నియమించడమన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న సముచితమైన నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధిగా ఎనలేని రీతిలో దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు.
సుప్రసిద్ధ నిర్మాత, అంజన ప్రొడక్షన్స్ అధినేత కొణిదెల నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రిగా పగ్గాలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి తాజాగా అందుతున్న సమాచారం. ప్రస్తుతం సినిమాటోగ్రాపీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందులు దుర్గేష్ ఆ తర్వాత వ్యవసాయ మంత్రిత్వశాఖకు బదిలీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. నాగబాబుని సినిమాటోగ్రాఫీ మంత్రిగా నియమించడమన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న సముచితమైన నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధిగా ఎనలేని రీతిలో దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు. ఆంధ్రప్రధేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఎప్పుడూ సినిమాటోగ్రాఫీకి సంబంధించి లబ్దప్రతిష్టుడైన సినిమా ప్రముఖుడు బాధ్యతలు నిర్విర్తించే అవకాశమే లేకుండా పోయింది. ఏదో నామ్కేవాస్తే వ్యక్తులే ఈ శాఖని ఇంతవరకూ చేపడుతూ వస్తున్నారు. మొహమాటం కొద్దీ ఎవరినో బుజ్జగించేందుకే ఈ మంత్రిత్వశాఖ ప్రభుత్వాలకు ఉపకరిస్తూ రావడాన్ని ఇప్పటివరకూ చూస్తున్నాం.
పూర్వం వేరు. ఇప్పుడు తెలుగు సినిమా కాన్వాస్ భారీ ఎత్తున పెరిగింది. ప్రపంచస్థాయికి తెలుగుసినిమా చేరుకున్నా కూడా ఇంకా ప్రభుత్వాలకు ఈ విషయం గుర్తుకు రాలేదు. కోటానుకోట్ల రూపాయల పెట్టుబడులతో పాన్ ఇండియా సినిమాల పందేరంలో పరిశ్రమ ఉరకలు వేస్తోంది. మరోవైపు భారీ వైపల్యాలు, నష్టాలు కూడా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్నది. ఓటీటిల దెబ్బకి సినిమా ధియేటర్లకి జనం రావడమే మానేశారు. అనేకరకాల వేదికలమీద వినోదం విరివిగా లభ్యమవుతున్న తరుణంలో సినిమా మాధ్యమం ఉనికి ప్రశ్నార్ధకమైపోతోంది. జనాలు రాక, జనాలను ధియేటర్లకు రప్పించి కథలు, కథానాయకులు లేక ధియేటర్లు నడుపుకోలేని దుస్థితిలో అనేక చోట్ల, అనేక ధియేటర్లు గొడవన్లు కింద, మాల్స్ కింద రూపాంతరం చెందుతున్నాయి. మొన్నీమధ్యనే చూశాం ధియేటర్లు మూసేస్తాం అని ధియేటర్ల యాజామాన్యాలు ఆందోళనకు దిగినట్టుగా జరిగిన గందరగోళం అంతాఇంతా కాదు.
సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్, అత్యంత విశాలమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న హీరోగా పేరుమోసిన, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానుండగా ఇటువంటి ఆందోళన ధియేటర్ల యాజామాన్యం నుంచి ఎదురవడం నిజంగానే అందరినీ కలవరపరిచింది. చివరికి ఇదెంత వరకూ చేరిందంటే తానే స్వయంగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో వార్నింగ్‌లాంటి బహిరంగలేఖను పరిశ్రమకి పంపించడమంటే లెలుగు సినిమా పరిశ్రమకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యన ఎంత పెద్ద అగాధం ఏర్పడిందో అవగతమవుతోంది. దీనికి కారణం ఒక్కటే. చిత్రపరిశ్రమతో ప్రత్యక్షసంబంధాలు, క్రియాశీలకమైన పరిజ్ఞానం ఉన్న సమర్ధులు రెండింటికీ మధ్యన వారధిలా వ్యవహరించగలిగే అవగాహన, ఆకళింపు ఉన్న ఎత్తైన వ్యక్తులు ప్రభుత్వాల తరుఫున లేకపోవడం అన్నదే ప్రధానమైన లోపం. సరే, చిత్రపరిశ్రమ సంఘటితంగా కనిపించే అసంఘటిత పరిశ్రమ. అందరూ ఒక్కటిగానే కనిపిస్తారు, కానీ ఎవరి కుంపటి వారిదన్నట్టుగానే కార్యకలాపాలు సాగుతుంటాయి. ఎవరి లబ్ధి కోసం వాళ్ళు అర్రులు సాచి, వ్యవహరిస్తుంటారు. తీరా ఓ సమస్య వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు నమిలే పరిస్థితే పరిశ్రమలో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతుంటుంది.
ఈ స్టేల్మేట్ సిట్యువేషన్‌కి నాగబాబులాంటి నటుడిగా, నిర్మాతగా, మెగాఫ్యామిలీకి చెందిన బలమైన వ్యక్తిత్వాన్ని సముపార్జించుకున్న ప్రయోజకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రిగా వస్తే అట్టడుగు సమస్యల నుంచి అన్నటినీ ముందస్తుగానే పసిగట్టి, ఎప్పటికప్పుడు నిర్ణయవిధానాన్ని అమలు చేయగలిగి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంవిధానికి దొరుకుతుందనేది నిర్వివాదాంశం.