KRNL: తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో పెరిగింది. కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాంలోకి ఇన్ ఫ్లో 42,967 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. స్టోరేజ్ – 33.853 టీఎంసీ/105.788 టీఎంసీగా ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి 25,000 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తుండటంతో టిబి ఆనకట్టకు మరికొన్ని రోజులు ఓ మోస్తరు ఇన్ ఫ్లో కొనసాగుతుందని తుంగభద్ర బోర్డు అధికారులు గురువారం తెలిపారు.