VZM: సభ్యుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక సూచించారు. గురువారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దీపిక అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. పలు గ్రామాల్లోని సభ్యులు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.