కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Kanguva: ఇప్పటి వరకు తమిళ్, తెలుగులో మాత్రమే తన సినిమాలు రిలీజ్ చేస్తు వస్తున్న సూర్య.. ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తు కంగువ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న కంగువ సినిమా సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచానలు పెంచేశాయి. ఇందులో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో 3డీ & ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారు. దిశా పటాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అనిమల్ సినిమాలో అబ్రార్‌గా అదరగొట్టిన బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు మేకర్స్. కంగువ సినిమా టీజర్‌ను మార్చి 19న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘సిద్ధంగా ఉండండి. మంట పుట్టించడానికి కంగువ వస్తోంది.. రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు టీజర్ విడుదల కానుంది’ అని స్టూడియోస్ గ్రీన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. దీంతో కంగువ హ్యాష్ ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. కంగువ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.