Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. ఇక మరిచిపోయినట్టే!
వాస్తవానికైతే.. హరిహర వీరమల్లు సినిమాను పవన్ ఫ్యాన్స్ దాదాపుగా మరిచిపోయారు. కానీ మధ్యలో ఏదో ఆశపెట్టి ఫ్యాన్స్‌ను వెయిట్ చేసేలా చేశారు. కానీ మళ్లీ కథ మొదటికి వచ్చేసేంది. దీంతో వీరమల్లుని ఇక మరిచిపోయినంత పనైనట్టే.
Harihara Veeramallu: ఈ సినిమా నిర్మాత ఏఎం.రత్నం అప్పుడప్పుడు ఏదో ఇవ్వాలన్నట్టుగా అప్డేట్స్ ఇస్తున్నారు కానీ.. డైరెక్టర్ క్రిష్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. అంతేకాదు.. అనుష్కతో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడాని.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో.. హరిహరి వీరమల్లు ఇప్పట్లో కష్టమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇటీవల ఏఎం. రత్నం మాట్లాడుతూ.. ప్రస్తుతం హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి.. త్వరలోనే స్పెషల్ ప్రోమో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని.. పవన్ ఫ్యాన్స్‌ను ఊరించారు. ఇక ఆ స్పెషల్ ప్రోమో మహా శివరాత్రిగా బయటికొస్తుందని.. రెండు మూడు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. దీంతో.. హరిహర వీరమల్లు హ్యాష్ ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అయ్యాయి.
కానీ.. కట్ చేస్తే అసలు ప్రోమో కాదు కదా.. కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. పోనీ ఫ్యాన్స్ ఇంతగా ట్రెండ్ చేస్తున్నారు.. ఫలానా రోజు ప్రోమో రిలీజ్ ఉంటుందనే అప్డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్. దీంతో హరిహర వీరమల్లు మంచి ఛాన్స్ మిస్ చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే.. ఇదే ట్రెండింగ్‌లో ప్రోమో రిలీజ్ అయి ఉంటే.. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయి.. పవన్ వీరమల్లు సెట్స్‌లోకి అడుగుపెట్టేవరకు.. ఇదే హై మెంటైన్ చేసేవారు ఫ్యాన్స్. కానీ అలా జరగలేదు. త్వరలో ఈ సినిమా ప్రోమో వచ్చిన కూడా ఎలక్షన్స్ హడావిడిలో పట్టించుకునే వారు ఉండరు. కాబట్టి.. ఏపి ఎలక్షన్స్ అయిపోయి పవన్ మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే వరకు హరిహర వీరమల్లును మరిచిపోయినట్టే.