»Miss World 2024 Indian Girl Sinishetti Interesting Facts
Miss World 2024 పోటీలో భారతీయ యువతి సినిశెట్టి… ఆసక్తికరమైన విషయాలు
ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో మిస్ ఇండియా 2022 విజేత సినిశెట్టి పాల్గొనడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇంకొన్ని గంటల్లో తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో సినిశెట్టి గురించి చాలా విషయాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Miss World 2024 Indian girl Sinishetti... interesting facts
Miss World 2024: ఈ సంవత్సరం మిస్ వరల్డ్ 2024 పోటీలు మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసింది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తేలనుంది. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఈ పోటీలు జరగడం, అందులో మిస్ ఇండియా- 2022 సినిశెట్టి (Sini Shetty) పాల్గొనడం విశేషం. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ సినిశెట్టి దక్కించుకుంటుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో తన గురించి చాలా విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి తల్లిదండ్రులది మంగళూరు అయితే తాను మాత్రం ముంబయిలో పుట్టి, పెరిగింది.
అకౌంటింగ్ ఫైనాన్స్‌లో డిగ్రీ పట్టా పొందింది. ఆ తరువాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసింది. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం నాలుగేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. 14 ఏళ్లకే స్టేజ్ ఫర్ఫార్మెన్స్లు ఇచ్చింది. తరువాత ఫ్యాషన్‌పై మక్కువ పెంచుకుంది. మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా స్ఫూర్తితో మోడలింగ్ రంగంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్‌కు యాడ్ చేసింది. ఆ తరువాత 2022లో తొలిసారిగా మిస్ ఇండియా కర్ణాటక పోటీలో పాల్గొని టైటిల్‌ని కైవసం చేసుకుంది. అదే ఏడాది మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. వీటితో పాటు టైమ్స్ మిస్ బాడీ బ్యూటిఫుల్, ఎన్‌ఐఎఫ్‌డీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్) మిస్ టాలెంట్, సబ్- టైటిల్ అవార్డులూ అందుకుంది.
ఇక చివరిగా తన డ్రీమ్ అయిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రెండేళ్లుగా శ్రమిస్తుంది. పలు ఛాలెంజ్ ఈవెంట్లలో సత్తా చాటింది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో టాప్ 25, టాలెంట్ ఛాలెంజ్‌లో టాప్ 14, టాప్ మోడల్ ఛాలెంజ్‌లో టాప్ 20లో నిలిచి, మిస్ వరల్డ్ 2024 టైటిల్ లక్ష్యంగా వెళ్తోంది. బ్లాక్ కలర్ స్టైలిష్ దుస్తుల్లో బెస్ట్ డిజైనర్ డ్రెస్ ఫ్రమ్ ఆసియా అండ్ ఓషియానియాగా విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 18న ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన 71వ మిస్ వరల్డ్ పోటీలు.. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మార్చి 9న ముగుస్తాయి. టైటిల్ కోసం 112 మంది అందాల భామలు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ఆరుగురు భారతీయ మహిళలు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఏడో మహిళగా సినిశెట్టి నిలవాలని యావత్తు దేశం ఆశిస్తుంది.