MDK: అల్లాదుర్గం మండల పరిధిలోని వెంకట్రావుపేట్ గ్రామ శివారులో గురువారం దారి తప్పి వచ్చిన ఓ జింక పిల్లపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇది గమనించిన గ్రామస్తులు పశువైద్యాధికారి రాజుకు సమాచారం అందించాగ ఆయన ఘటన స్థలానికి చేరుకుని జింక పిల్లకు ప్రథమ చికిత్స చేసినా, అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, జింక పిల్లను వారికి అప్పగించారు.