AP: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీరాముడికి పరమ భక్తుడు, అపార బలం, జ్ఞానం, ధైర్యానికి హనుమంతుడు ప్రతీక. ఆయనను కోలవడం ద్వారా భయాలు, కష్టాలు తొలగి.. ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ఆ స్వామి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.