Singapore : చైనాకు చెక్ పెట్టేందుకు సింగపూర్ జలాల్లో ఆస్ట్రేలియా సబ్మెరేన్లు!
సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్మెరేన్లను తమ నేవల్ బేస్‌లో మోహరించేందుకు అనుమతిచ్చింది.
Singapore Welcomes Australia Submarines : దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమతో ఎంతో సత్సంబంధాలు కలిగిన ఆస్ట్రేలియా(Australia)తో కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రేలియాకు సంబంధించిన న్యూక్లియర్ సబ్ మెరేన్లను సింగపూర్‌లోని చాంగీ నేవల్ బేస్‌లో మోహరించేందుకు అనుమతి ఇచ్చింది.
మెల్బోర్న్లో జరుగుతున్న స్పెషల్ ఆసియన్ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి సింగపూర్ ప్రధాని లీ లుంగ్ మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దానిలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయమై సింగపూర్(Singapore) ప్రధాని లీ ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు తెలిపారు. తమ భద్రత అంశంలో ఆస్ట్రేలియా అత్యంత సన్నిహితమైన సంబంధాలను కలిగి ఉందన్నారు.
గతంతో పోస్టుకుంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధ నౌకలు, సబ్ మెరేన్ల(Submarines) మోహరింపు 35 శాతం వరకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. వాషింగ్టన్కు చెందిన మారటైమ్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. దీంతో సింగపూర్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దక్షిణ తూర్పు ఆసియాలో ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్ మెరేన్లను మోహరించేందుకు అంగీకరించంది. అయితే ఇది సింగపూర్ తీసుకున్న చాలా సాహసోపేతమైన నిర్ణయం అని మిగిలిన దేశాలు అభిప్రాయ పడుతున్నాయి.