టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై మరో దావా దాఖలైంది. ఆయన ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత అందులో తొలగించిన ఉద్యోగులకి అందాల్సిన 128 డాలర్ల సెవెరెన్స్ చెల్లింపులు చేయలేదని ఆయనపై కేసు నమోదైంది.
Elon Musk Lawsuit : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్(Elon Musk) ఎప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ పాత ఉద్యోగుల తరఫున ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ కౌన్సెల్ విజయ గద్దె, జనర్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్లు ఆయనపై దావా వేశారు.
ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగుల్ని(Employees) తొలగించారు. ఆ సమయంలో ట్విట్టర్ ఉద్యోగులకు రావాల్సిన 128 మిలియన్ డాలర్లను చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. అంటే అది మన భారతీయ కరెన్సీలో చూస్తే రూ.10,613,299,328. దీంతో ట్విట్టర్ మాజీ ఉన్నత ఉద్యోగులంతా కలిసి ఈ మేరకు కాలిఫోర్నియా కోర్టులో మస్క్‌పై దావా వేశారు. 2022లో ట్విట్టర్‌ను(Twitter) మస్క్ కొనుగోలు చేశారు. తర్వాత దాని పేరును ఎక్స్‌గా మార్చారు. అయితే ఎటువంటి కారణం లేకుండా సంస్థ నుంచి తమను తొలగించారని వారు దావాలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 తొలల తర్వాత తొలిసారిగా ఆయన బ్లూమ్‌బర్గ్ వరల్డ్ రిచ్చెస్ట్ బిలియనీర్ జాబితాలో తొలి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. ఇప్పుడు మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.