వేసవి దగ్గర పడుతోంది. ఈ సమయంలో చాలా మంది నీరు, జ్యూస్‌లు తాగుతుంటారు. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఇది చాలా ముఖ్యం. అయితే, ఈ సమయంలో చాలా మంది చెరకు రసం కూడా తాగుతుంటారు. మరి అది ఆరోగ్యానికి మంచిదా? లేదా తెలుసుకుందాం.
చెరకు రసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఒక గ్లాసు చెరకు రసం తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా దూరమవుతుంది. చెరకు రసంలో మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని అదనపు ఉప్పు, నీటి శాతాన్ని తొలగిస్తుంది. దీని వల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా తగ్గుతుంది. చెరకు రసంలో క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా, వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్, ఇంకా మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్మానికి చాలా మంచివి. శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలు దూరమై చర్మం మెరుస్తుంది. చెరకు రసం లివర్‌కు కూడా మంచిది. లివర్ సరిగ్గా పనిచేయకపోతే కామెర్లు వస్తాయి. చెరకు రసం శరీరంలోని ట్యాక్సిన్స్‌ని దూరం చేసి లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చెరకు రసం తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు
తాజాగా తీసిన చెరకు రసం తాగండి
చాలా ఎక్కువగా తాగవద్దు
మీకు మధుమేహం వంటి వ్యాధులు ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి
మొత్తం మీద, చెరకు రసం ఒక ఆరోగ్యకరమైన పానీయం. వేసవిలో తాగడానికి ఇది చాలా మంచిది.