టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక తన ఫోకస్‌ను జక్కన్నతో చేయబోయే గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే పెట్టబోతున్నాడట.
SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక తన ఫోకస్‌ను జక్కన్నతో చేయబోయే గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే పెట్టబోతున్నాడట. జక్కన్న, మహేశ్‌బాబు మిక్స్డ్ స్టిల్‌తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. అంటూ ఇటీవలే ఇచ్చిన అప్డేట్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. జక్కన్న పర్యవేక్షణలో లుక్ టెస్ట్ పూర్తి చేశాడట.
ఇప్పటివరకు 8 లుక్స్ ఫైనల్ చేశారని ఇన్సైడ్ టాక్. కాగా మహేశ్ బాబు నయా లుక్‌ను చూసేందుకు అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు జక్కన్న టీం ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. జక్కన్న కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి హాలీవుడ్ రేంజ్‌కు ధీటుగా సినిమా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.