TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఈ ఘటన జరగ్గా.. మృతులను ఫర్హత్(30), ఉమెరా(7), ఆయేషా(5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.