MDK: ‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.