WhatsApp : వాట్సాప్‌లో కొత్తగా ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా మారడానికి కొత్త కొత్త అప్డేట్లను తెస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు దానిలో ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
WhatsApp search by date feature: మనలో చాలా మందిరి వాట్సాప్(WhatsApp)ని చూడకుండా రోజు గడవదు. అంతగా దీన్ని మనం వాడేస్తున్నాం. అందుకనే మనకు అదనపు సౌలభ్యాల్ని కల్పించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను తీసుకుని వస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా ఇప్పుడు సెర్చ్ బై డేట్ ( search by date) అనే కొత్త ఫీచర్ మనకు అందుబాటులోకి వచ్చింది.
మనం సాధారణంగా మన ఛాట్ లిస్ట్‌లో ఉన్న పాత ఛాట్లను వెతుక్కోవాలంటే స్క్రీన్‌ని ముందుకు స్క్రోల్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వాటిని చూసుకోగలుగుతాం. చాలా పాత మెసేజ్‌లు కావాల్సి వచ్చినప్పుడు వెతుక్కోవడం అనేది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌తో ఆ ఇబ్బందులు కొంత వరకు తగ్గుముఖం పడతాయనే చెప్పవచ్చు.
మనం ఛాట్ చేసిన తేదీ గుర్తుంటే ఇక మీదట పాత ఛాటింగ్‌ని నెతుక్కోవడం మరింత సులభం అయిపోతుంది. ఈ విషయమై మార్క్ జుకర్ బుర్గ్ వాట్సాప్ అధికారిక వాట్సాప్ ఛానల్లో ఓ పోస్ట్ చేశారు. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో వివరిస్తూ ఉన్న పోస్ట్‌ని షేర్ చేశారు. డేట్‌ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా పాత ఛాట్‌ని ఎలా కనుగొనవచ్చో అందులో పంచుకున్నారు. మెసేజ్ వచ్చిన తేదీ గుర్తుంటే ఆ రోజు గ్రూపుల్లో, వ్యక్తిగత ఛాటింగుల్లో వచ్చిన మెసేజ్‌లు అన్నింటినీ సులభంగా కనుగొనవచ్చు.