»Man Found Worms In Cadbury Chocolates Laboratory Report Confirms It
Cadbury Chocolate : క్యాట్బరీ చాక్లెట్లో తెల్ల పురుగు
హైదరాబాదులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన క్యాట్బరీ డైరీమిల్క్ చాక్లెట్లో తెల్ల పురుగు దర్శనం ఇవ్వడం సర్వత్రా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Cadbury Chocolate : పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా డైరీ మిల్క్ చాక్లెట్లను అంతా చాలా ఇష్టంగా తినేస్తుంటారు. అయితే ఈ నెల 9న జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో ఉన్న రత్న దీప్ సూపర్ మార్కెట్లో విజయ్ కుమార్ అనే వ్యక్తి డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్(chocolate)ని కొనుగోలు చేశాడు. దాన్ని విప్పి చూడగా దానిలో తెల్ల పురుగు దర్శనం ఇచ్చింది.
దీంతో షాకైన విజయ్ కుమార్ ఈ విషయంపై అప్రమత్తం అయ్యాడు. వెంటనే బల్దియా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాడు. దీంతో ఆ క్యాట్బరీ డైరీ మిల్క్ (Cadbury Dairy Milk) చాక్లెట్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రయోగశాలలో పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల్లో అందులో పురుగులే కుండా, వాటికి సంబంధించిన గూళ్లు వలల మాదిరిగా ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఇది తినడానికి ‘అన్‌సేఫ్’ అంటూ రిపోర్టు వచ్చింది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బహుశా ప్యాకింగ్ లోపాల వల్ల ఇలా పురుగు చేరి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు రత్నదీప్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్యాకింగ్ సరిగ్గా లేని చాక్లెట్లను అమ్మకానికి ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.