చెన్నై చిన్నది త్రిష గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. సినీ కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోంది.
Trisha: ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు ధీటుగా వరుస ఆఫర్లో దూసుకుపోతోంది త్రిష. పొన్నియలన్ సెల్వన్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన త్రిష.. చివరగా విజయ్ లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష.. చివరగా 2016లో నాయకి అనే సినిమా చేసింది త్రిష. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమై కోలీవుడ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం చిరుతో రొమాన్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్ అవుతునే ఉన్నది త్రిష. ఆ మధ్య సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ త్రిషతో రేప్ చేసే ఛాన్స్ రాలేదని చెప్పడంతో.. అమ్మడు మండిపోయింది. ఫైనల్‌గా మన్సూర్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు త్రిషపై దారుణమైన ఆరోపణలు చేశారు.
దీంతో.. త్రిష అతని పై న్యాయపరమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. త్రిష చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డేటింగ్ పై గురించి చెప్పుకొచ్చింది. తాను పలువురితో డేటింగ్ చేశానని, రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పుకొచ్చింది. అయితే.. ఇవేవి ఒక్కరితో కూడా వర్కౌట్ అవలేదని చెప్పింది. ఒకానొక దశలో తనకు పెళ్లి సెట్ అవదని, వివాహం అనేది బాధ్యత అని, తనవల్ల కాదు అనే అనుమానం కూడా వచ్చిందన్నారు.. కానీ ఈ వయసులో తనను తాను ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యమని, మనకోసం మనం బతకడం మంచిదని.. అన్నారు. దీంతో త్రిష కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.