»South Korea Fertility Rate World Lowest Slips To Record Low
South Korea : ఈ దేశంలో ఓ మహిళ పావు వంతు బిడ్డకు జన్మనిస్తోంది
ఒక దేశంలో ఓ మహిళ సగం బిడ్డకు జన్మనిస్తుంది. ఏంటి సగం బిడ్డకా.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజం. దీనికి దక్షిణ కొరియా సాక్షిగా ఉంది. ఈ దేశం సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది.
South Korea : ఒక దేశంలో ఓ మహిళ సగం బిడ్డకు జన్మనిస్తుంది. ఏంటి సగం బిడ్డకా.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజం. దీనికి దక్షిణ కొరియా సాక్షిగా ఉంది. ఈ దేశం సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. అయినా కానీ.. ఇక్కడ సంతానోత్పత్తి రేటు 2023లో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ క్షీణతకు ఒక కారణం పెరిగిన ఖర్చులు. మహిళలు తమ వృత్తి, పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. అందుకే వారు పిల్లలకు కనకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. దక్షిణ కొరియా మహిళకు ఉన్న పిల్లల సగటు సంఖ్య 0.78 నుండి 2022లో రికార్డు స్థాయిలో 0.72కి పడిపోయింది. ఇది ఒక మహిళకు అవసరమైన 2.1 రేటు కంటే చాలా తక్కువ.
2018 నుండి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD)లో 1 కంటే తక్కువ రేటుతో దక్షిణ కొరియా మాత్రమే సభ్యుడు. OECDలో అత్యంత లింగ వేతన వ్యత్యాసాన్ని కలిగి ఉన్న దేశం దక్షిణ కొరియా. ఇక్కడ పురుషులు సంపాదించే దానిలో మూడింట రెండు వంతులు స్త్రీలు పొందుతారు. దక్షిణ కొరియా 2024లో సంతానోత్పత్తి రేటు 0.68కి పడిపోయే అవకాశం ఉందని గతంలో అంచనా వేసింది. గత సంవత్సరం రాజధాని సియోల్ సంతానోత్పత్తి రేటు 0.55. దక్షిణ కొరియాలో పిల్లలు పుట్టడానికి వివాహం తప్పనిసరి. కానీ దేశంలో వివాహాలు కూడా తగ్గుతున్నాయి.
2006 నుండి ఎక్కువ మంది పిల్లలను కనే జంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. ప్రభుత్వం 270 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇందులో సబ్సిడీలు, పిల్లల సంరక్షణ సేవలు ఉన్నాయి. దక్షిణ కొరియా ప్రధాన రాజకీయ పార్టీలు ఏప్రిల్ ఎన్నికలకు ముందు జనాభా క్షీణతను అరికట్టడానికి విధానాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో మరిన్ని పబ్లిక్ హౌసింగ్, సులభమైన రుణాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఒక్క దక్షిణ కొరియాలోనే ఉందని కాదు. జపాన్, చైనాలలో కూడా ఇదే పరిస్థితి. 2023లో జపాన్లో జన్మించిన శిశువుల సంఖ్య వరుసగా ఎనిమిదో సంవత్సరం కొత్త కనిష్టానికి పడిపోయింది. 2023 లో చైనా జనాభా వరుసగా రెండవ సంవత్సరం క్షీణించింది.