TG: రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు మూసివేస్తున్నట్లు నగర పోలీసు శాఖ అధికారిక ప్రకటన చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.