BHPL: నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని MLA గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన రైతులను ఎంపిక చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు.