ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను ప్రభుత్వం తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించింది. చంద్రశేఖరపురం, కనిగిరి, హనుమంతునిపాడు,పెద్ద చెర్లోపల్లి మండలాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మార్కాపురం జిల్లాలో మొత్తం ఐదు మండలాలను తీవ్ర కరువు మండలాలుగా గుర్తించగా, అందులో నాలుగు కనిగిరి నియోజకవర్గానికి చెందినవే కావడం గమనార్హం.