ELR: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లను అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.