SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 20వ వార్డు సచివాలయం పరిధిలో పలు ప్రాంతాలలో బుధవారం శానిటేషన్ సెక్రెటరీ భారతి పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రవి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నిరంతర శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.