కృష్ణా: యనమలకుదురు శివాలయంలో హుండీ చోరీ ఘటనపై విచారణ వేగవంతమైంది. హుండీ నిధుల గోల్మాల్పై ఈవో సుబ్రహ్మణ్యం కఠిన చర్యలు తీసుకున్నారు. అర్చకులు విద్యాసాగర్, పూర్ణచంద్రరావు, గుమస్తా రఘుపతిని సస్పెండ్ చేశారు. మాజీ ఈవో భవానీపై కేసు నమోదు కాగా ఆమె పరారీలో ఉంది. గుమస్తా ఇంట్లో నోట్ల బస్తా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అర్చకులు, ఓ కూలీని పోలీసులు అరెస్ట్ చేశారు.