GNTR: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా సి.ఎం.సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఆయనను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కలెక్టర్కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు అధికారులు కాసేపు మాట్లాడుకున్నారు. జిల్లాలో పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు.